తెలుగు చలనచిత్రనిర్మాతల మండలి ఎన్నికలు ఆదివారం జరిగాయి. అయితే ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, సుప్రియతో పాటు కోశాధికారిగా టి.రామసత్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మిగిలిన పోస్టులకు ఎన్నికలు జరిగాయి. సి. కళ్యాణ్ ఆధ్వర్యంలోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్, దిల్ రాజు ఆధ్వర్యంలోని ప్రోగ్రసీవ్ ప్రొడ్యూసర్స్ పానెల్ ఈ పోటీలో తలపడ్డాయి. మొత్తం 1134 ఓట్లకుగాను 677 ఓట్లు పోలయ్యాయి. అందులో రెండు ఓట్లు చెల్లలేదు. ఇక అధ్యక్షుడిగా దిల్ రాజు ప్యానెల్ కి చెందిన కె.ఎల్. దామోదర ప్రసాద్, సి. కళ్యాణ్ ప్యానెల్ క్యాండిడేట్ జెమినీ కిరణ్ పై 24 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 16 రౌండ్స్ లో 15 రౌండ్లలో దామోదర ప్రసాద్ ఆధిపత్యం కనబరిచారు. ఒక సమయంలో ఇద్దరికీ సమానమైన ఓట్లు రావటంతో ఇరువర్గాలలోనూ ఆందోళన నెలకొంది. అయితే చివరికి దాము విజయం సాధించారు.
Also Read : Liver Health: ఈ లక్షణాలు ఉంటే.. మీకు లివర్‌లో సమస్యలు ఉన్నట్లే..
ఇక ప్రధాన కార్యదర్శులుగా కళ్యాణ్ ప్యానెల్ తరపున టి. ప్రసన్నకుమార్(397), వైవియస్.చౌదరి (380) భారీ అధిక్యంతో గెలిచారు. ఉప కార్యదర్శులుగా దిల్ రాజు ప్యానెల్ తరపున భరత్ చౌదరి (412) ఘన విజయం సాధించగా, కళ్యాణ్ మద్ధతులో స్వతంత్ర అభ్యర్ధి నట్టికుమార్ (247) గెలిచారు.
ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా దిల్ రాజు (470), డి.వి.వి. దానయ్య (421), రవికిశోర్.పి.వి (419), రవిశంకర్ యలమంచిలి (416), పద్మిని (413), బెక్కెం వేణుగోపాల్ (406), వై. సురేందర్ రెడ్డి (396), మధుసదన్ రెడ్డి బి. (347), అభిషేక్ అగర్వాల్ (297), తోట కృష్ణ (293) విజయం సాధించగా, కల్యాణ్ ప్యానెల్ నుంచి గోపీనాధ్ ఆచంట (3530, కేశవరావు పల్లి (323), వజ్జా శ్రీనివాసరావు (306), ప్రతాని రామకృష్ణ గౌడ్ (286), పూసల కిశోర్ (285) గెలుపొందారు.
Also Read : Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం..