Daksha Teaser: ‘దక్ష’ టీజర్ వచ్చేసింది.. పేరు మార్చుకుని వచ్చేసిన మంచు లక్ష్మి!
- పదేళ్ల తరువాత లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ నుంచి సినిమా
- దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) సినిమా టీజర్ వచ్చేసింది
- పోలీస్ ఆఫీసర్‌గా మంచు లక్ష్మి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi Daksha Teaser Out: దాదాపు పదేళ్ల తరువాత ‘లక్ష్మి ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ నుంచి సినిమా రాబోతుంది. దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) సినిమాలో మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ కాగా.. మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేశారు. టీజర్‌తోనే అంచనాలు పెంచిన దక్ష చిత్రం సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఐదేళ్ల తరువాత నటి మంచు లక్ష్మి వెండితెరపైకి రాబోతున్నారు. దక్ష చిత్రంలో ఆమె ఓ లేడీ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో మంచు మోహన్‌బాబు, కీలక పాత్రలో సముద్రఖని, మలమాళ నటుడు సిద్ధిక్, చైత్ర శుక్ల వంటి వారు కనిపించబోతున్నారు. 2015లో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రం విడుదలైంది. పదేళ్ల తరువాత దక్ష సినిమా రిలీజ్ కానుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: CloudBurst: అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి?.. ముందుగా ఊహించడం కష్టమా?
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్ష మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ మెప్పించేలా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మంచు లక్ష్మి పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టారు. థ్రిల్లింగ్ అంశాలతో సరికొత్తగా టీజర్ ఉందనే చెప్పాలి. టీజర్ ద్వారా ఫుల్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందించినట్లు అర్ధమవుతోంది. మూడేళ్ల క్రితమే ‘అగ్ని నక్షత్రం’ పేరుతో మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పుడు టైటిల్ మారుస్తూ దక్షగా వస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..