Site icon NTV Telugu

Daksha Teaser: ‘ద‌క్ష’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. పేరు మార్చుకుని వచ్చేసిన మంచు ల‌క్ష్మి!

Daksha Teaser

Daksha Teaser

Manchu Lakshmi Daksha Teaser Out: దాదాపు పదేళ్ల తరువాత ‘ల‌క్ష్మి ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ నుంచి సినిమా రాబోతుంది. ద‌క్ష (ది డెడ్లీ కాన్సిఫ‌రిసీ) సినిమాలో మంచు ల‌క్ష్మి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ కాగా.. మంచు ల‌క్ష్మి, మంచు మోహన్ బాబు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేశారు. టీజర్‌తోనే అంచనాలు పెంచిన దక్ష చిత్రం సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఐదేళ్ల తరువాత నటి మంచు ల‌క్ష్మి వెండితెరపైకి రాబోతున్నారు. దక్ష చిత్రంలో ఆమె ఓ లేడీ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో మంచు మోహన్‌బాబు, కీలక పాత్రలో సముద్రఖని, మలమాళ నటుడు సిద్ధిక్, చైత్ర శుక్ల వంటి వారు కనిపించబోతున్నారు. 2015లో ల‌క్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రం విడుదలైంది. పదేళ్ల తరువాత ద‌క్ష సినిమా రిలీజ్ కానుంది.

Also Read: CloudBurst: అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి?.. ముందుగా ఊహించడం కష్టమా?

వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ద‌క్ష మూవీ టీజ‌ర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్‌ మెప్పించేలా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీసర్‌గా మంచు ల‌క్ష్మి ప‌వ‌ర్‌పుల్‌ పాత్రలో కనిపించారు. యాక్ష‌న్ సీన్స్‌లలో అద‌రగొట్టారు. థ్రిల్లింగ్ అంశాలతో స‌రికొత్త‌గా టీజ‌ర్ ఉందనే చెప్పాలి. టీజర్ ద్వారా ఫుల్ యాక్ష‌న్‌, క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా సినిమా రూపొందించిన‌ట్లు అర్ధ‌మ‌వుతోంది. మూడేళ్ల క్రితమే ‘అగ్ని నక్షత్రం’ పేరుతో మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పుడు టైటిల్ మారుస్తూ దక్షగా వస్తోంది.

Exit mobile version