Site icon NTV Telugu

Purandeshwari: హిందువుల మనోభావాలను దెబ్బదీసే విధంగా ఇండియా కూటమి నేతల వ్యాఖ్యలు

Purandeshwawri

Purandeshwawri

తమిళనాడు మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ సనాతన ధర్మంపై హాట్ కామెంట్స్ చేశాడు. డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటి రోగాలను నిర్మూలించినట్లే.. సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని ఆయన కామెంట్స్ చేశాడు. అయితే, ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై హిందు సంఘాలు, బీజేపీ నేతలు ఉదయ్ నిధి స్టాలిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.

Read Also: Karnataka : ఛీ.. ఛీ.. వీడు అస్సలు మనుషులేనా? మూగ జీవాలను కూడా వదలట్లేదు..

భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్‌ నిధి స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలనడం హైయమైన చర్య అని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఉదయ నిధి కామెంట్లు రాజ్యాంగ విరుద్ధం.. తమిళనాడులోని హిందూ మతపరమైన, ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే శేఖర్ బాబు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండడాన్ని దేనికి సంకేతం?.. అని ఆమె ప్రశ్నించారు.

Read Also: Rana Daggubati: జై భీమ్ వివాదం.. వారు కాంట్రవర్సీ చేశారు.. రానా సెన్సేషనల్ కామెంట్స్

సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే ఇండియా కూటమి ఉద్దేశమని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ చర్యలు భారతదేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.. విపక్ష కూటమి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు కూడా వీరికి లేదు.. 2010 సంవత్సరంలో హిందూ సంస్ధలను లష్కరే తొయిబా సంస్ధతో రాహుల్ గాంధీ పోల్చి మాట్లాడడం అత్యంత దారుణం అని ఆమె పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బదీసే విధంగా ఇండియా కూటమిలోని నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఉదయ్ నిధిని సమర్ధిస్తూ కార్తిక్ చిదంబరం చేసిన వ్యాఖ్యలు గర్హనీయం అని పురంధేశ్వరి అన్నారు.

Exit mobile version