NTV Telugu Site icon

Daggubati Purandeswari : సమావేశం కన్నుల పండువగా ఉంది

Daggubati Purandeswari

Daggubati Purandeswari

ఏపీ ఎన్నికల తరువాత తొలిసారి ఏపీ బీజేపీ విసృతస్థాయి సమవేశం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదని, సమావేశం కన్నుల పండువగా ఉందన్నారు. రెండు వేల మంది పాల్గొనడం ఆనందదాయకమని, దేశం లో 140కోట్ల జనభా తో ఎన్నికలను శాంతి యుతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు పురంధేశ్వరి. ఈవిఎం లు, పోలీసులు సహకారం లేదని ఓటమి చెందిన పార్టీ లు ఆరోపణలు సహజమని, ఎన్డీఎ అద్భుతమైన విజయాన్ని సొంతమన్నారు పురంధేశ్వరి. ఆత్మ నిర్భర్ భారత్ కు ఓటు వేశారని, ప్రజలు ఆశించిన రీతిలో సంక్షేమం, అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్డీఏ కూటమి కి ఓటు వేయడంతో అయిదవ ఆర్థిక శక్తిగా అవతరించిందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం సంక్షేమం ఆర్థిక శక్తిగా ఉండడంమే అని, 15 కోట్ల మందికి కుళాయి కనెక్షన్లు.. ప్రతి రోజూ 30కిలోమీటర్లు రోడ్డు వేస్తున్నామన్నారు. 2019. 23కోట్లు ఓట్లు, 2024…24 కోట్ల ఓట్లు వచ్చాయని ఆమె అన్నారు. ఓట్లు విషయంలో బలం పెరిగిందని, ప్రతి పక్షాలు దుష్ప్రచారం వల్ల నష్టపోయామన్నారు. కాంగ్రెస్, యుపీఏ రాజ్యాంగం వందకు పైగా ఎమెండ్ మెంట్స్ చేసింది వారే అని ఆమె అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగానికి నమస్కరించారని, అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమన్నారు. పంచతీర్థ అభివృద్ధి నరేంద్ర మోడీ అని, 21నెలలు ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ అని, మోడీ గ్యారంటీకీ.. ప్రజలు ఓటు వేశారని పురందేశ్వరీ అన్నారు.