NTV Telugu Site icon

Daggubati Purandeswari: గవర్నర్‌కు పురంధేశ్వరి లేఖ..

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ రోజు సాయంత్రం.. కాపు రామచంద్రారెడ్డి, సాధినేని యామిని శర్మ, బిట్ర శివన్నారాయణ, పాతూరి నాగభూషణం తదితర నేతలతో రాజ్‌భవన్‌ వెళ్లిన ఆమె.. గవర్నర్‌ను కలిసి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు ప్రకటించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ అందించారు..

ఇక, పురంధేశ్వరి లేఖలోని అంశాలను పరిశీలిస్తే..
1. మొత్తం అవుట్ స్టాండింగ్ RBI లిస్టు ప్రకారం తెచ్చిన అప్పులు.
2. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల మొత్తం (కార్పొరేషన్ల వారీగా)
3. కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు మొత్తం.
4. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు మొత్తం
5. రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు మొత్తం
6. ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్స్ వివరాలు
7. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రావిడెంట్ ఫండ్స్ నుండి మరియు ఆర్థిక సంస్థల నుండి తెచ్చిన అప్పుల వివరాలు
8. ప్రభుత్వ ఉద్యోగులకు TA, DA బకాయిలు ఎంత ఉన్నవి
9. ప్రతి సంవత్సరం రీపేమెంట్ కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టవలసి ఉన్నది.
10. సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్కు, డిస్కంలకు, పవర్ సప్లయర్స్ లకు చెల్లించవలసిన బకాయిలు ఎంత ఉన్నవి .
11. నిధులు రిలీజ్ చేయవలసి ఉన్నప్పటికీ, అతికొద్ది మాత్రమే ఇచ్చి మొత్తం రిలీజ్ చేసినట్లుగా ప్రకటనలు చేస్తూ.. బట్టన్ నొక్కిన వారికి కూడా పాక్షికంగా చెల్లించిన విధానం. ఈ విధంగా ఈ సంవత్సరం సంక్షేమ పథకాలకు ఎంత నిధులు చెల్లించవలసి ఉన్నది.
12. రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని కేసులు ఉన్నవి .
13. కోర్టులు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలుపరచకుండా కంటెంప్ట్ కేసులు ఎన్ని ఉన్నవి లాంటి ఈ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా తమరు తెప్పించవలసినదిగా కోరుతున్నాము అంటూ తన లేఖలో పేర్కొన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.