NTV Telugu Site icon

Dadasaheb Phalke Awards 2024: ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్.. ఉత్తమ నటిగా నయనతార!

Dadasaheb Phalke Awards 2024

Dadasaheb Phalke Awards 2024

Sandeep Reddy Vanga bags Best Director for Animal Movie: సినీరంగంలో ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ 2024 అవార్డుల కార్యక్రమం మంగళవారం (ఫిబ్రవరి 20) ముంబైలో అట్టహాసంగా జరిగింది. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్‌’ సినిమాలో హీరోగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా, హీరోయిన్‌గా నటించిన నయనతార ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక బాలీవుడ్‌ను షేక్ చేసిన ‘యానిమల్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. యానిమల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు సాదించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

యానిమల్‌లో అబ్రార్ పాత్ర పోషించిన బాబీ డియోల్ ఉత్తమ నటుడు (నెగెటివ్‌ రోల్‌) అవార్డు అందుకున్నాడు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన సామ్ బహదూర్‌లో ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా పాత్రను పోషించిన విక్కీ కౌశల్‌కు ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) అవార్డు లభించింది. క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) ఎంపిక కాగా.. ఉత్తమ సంగీత దర్శకుడుగా అనిరుధ్‌ రవిచందర్‌ ఎంపికయ్యాడు. ఏ వేడుకకు రాణి ముఖర్జీ, షాహిద్ కపూర్, నీల్ భట్, ఐశ్వర్య శర్మ, విక్రాంత్ మాస్సే తదితరులు హాజరయ్యారు.

సినిమా:
ఉత్తమ గీత రచయిత – జావేద్‌ అక్తర్‌ ( నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ)
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మేల్) – వరుణ్‌ జైన్‌
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ ( ఫిమేల్) – శిల్పా రావు
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ – యేసుదాసు
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ – మౌషుమీ ఛటర్జీ

టెలివిజన్‌:
టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌ – ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌
ఉత్తమ నటుడు – నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌)
ఉత్తమ నటి – రూపాలీ గంగూలీ (అనుపమ)

వెబ్‌సిరీస్‌:
క్రిటిక్స్‌ ఉత్తమ నటి – కరిష్మా తన్నా (స్కూప్‌)