Site icon NTV Telugu

Boy Died: లావుగా ఉన్నాడని కొడుకుని బలవంతంగా ట్రెడ్‌మిల్‌ చేపించిన తండ్రి.. చివరకు..

Viral Video

Viral Video

ఓ తండ్రి విపరీతమైన చర్యల వల్ల అతని 6 ఏళ్ల కొడుకును మృత్యువు కారకుడయ్యాడు. ఆ వ్యక్తి, తన రెండవ కొడుకు లావుగా ఉన్నాడని, ట్రెడ్‌మిల్‌ పై పరుగెత్తాలని ఆదేశించాడు. ఆ కుర్రాడి వయసును పట్టించుకోకుండా ట్రెడ్ మిల్ స్పీడ్ ను విపరీతంగా పెంచాడు. దీంతో ఆ బాలుడు కొన్ని రోజుల తర్వాత శరీరంలో లోపల జరిగిన డామేజ్ ను గమనించకపోవడంతో గాయాలపాలై మృతి చెందాడు. క్రైమ్ సీన్ విచారణలో అమెరికాలో మూడేళ్ల క్రితం జరిగిన దారుణ ఘటన వెలుగు చూసింది. న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్ గ్రెగర్ తన కొడుకు మరణానికి 2021లో అరెస్టయ్యాడు. ఈ కేసులో ఇటీవల జరిగిన విచారణలో బాలుడిని చంపిన ట్రెడ్‌మిల్ రన్ ఫుటేజీని సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. అదే సంవత్సరం మార్చి 20న, క్రిస్టోఫర్ తన కొడుకు కోరీతో కలిసి స్థానిక ఫిట్‌నెస్ సెంటర్‌ కి వెళ్లాడు.

Also read: Tumour Removed: 16.7 కిలోల బరువున్న భారీ కణితిని తొలిగించిన వైద్యులు..

అబ్బాయి లావుగా ఉన్నందున ట్రెడ్‌మిల్‌పై పరిగెతించాడు. అది ఆ చిన్న అబ్బాయికి కష్టమైనప్పటికీ, అతను తన వేగాన్ని గణనీయంగా పెంచాడు. దీంతో బాలుడు పలుమార్లు కిందపడిపోయాడు. అయినా తండ్రి ఏమాత్రం వెనుకాడకుండా కొడుకును బలవంతంగా ట్రెడ్‌మిల్‌ పై ఎక్కించాడు. నో చెబితే కొట్టేస్తా అన్నట్లుగా అందులో అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత 2021 ఏప్రిల్ 1న బాలుడి తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడుని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు నిజం వెలుగులోకి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Also read: David Warner Pushpa 2: నాకు మళ్లీ పని పడింది.. దీన్ని నేర్చుకోవాలంటున్న డేవిడ్ భాయ్..

మరుసటి రోజు బాలుడు మరణించాడు. స్కానింగ్‌ లో అతడికి శరీరం అంతర్గతంగా తీవ్ర గాయాలైనట్లు తేలింది. గుండె. కాలేయం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు శ్వాసకోశ సమస్యలతో అబ్బాయి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అదే ఏడాది జూలైలో క్రిస్టోఫర్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ఇందుకు సంబంధించి దృశ్యలు చూసి బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ కేసులో అతను జీవిత ఖైదు అనుభవించే అవకాశం లేకపోలేదు.

Exit mobile version