NTV Telugu Site icon

Nagavamshi : “డాకు మహారాజ్” నిర్మాత నాగవంశీ స్పెషల్ రిక్వెస్ట్

New Project (49)

New Project (49)

Nagavamshi : నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘డాకు మహారాజ్’. ఇది బాలయ్య సినీ కెరియర్లో 109వ చిత్రంగా సంక్రాంతి కానుకగా త్వరలో రాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకం పై సంయుక్తంగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

Read Also:Narendra Modi: గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..

ప్రజెంట్ టాలీవుడ్ లో సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ ఒకరు. మరి తన సినిమాల పట్ల ఉన్న గ్రిప్ కానీ ముక్కుసూటిగా వ్యవహరించే తీరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మంచి హైలైట్ గా తాను కనిపిస్తూ ఉంటారు. అలాగే చెప్పి మరీ సినిమాను సక్సెస్ కొట్టించడంలో తనకు సెపరేట్ ట్రాక్ రికార్డు కూడా ఉంది. అయితే ఇపుడు తన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి సంక్రాంతి కానుకగా వస్తున్న లేటెస్ట్ చిత్రమే “డాకు మహారాజ్”. ఈ సినిమాపై గట్టి అంచనాలు ఉన్నాయి.

Read Also:Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల..

అయితే ఈ సినిమా రిలీజ్ కి దగ్గరకి వస్తున్న సమయంలోజరుగుతున్న చిన్న చిన్న పొరపత్యాల విషయంలో నందమూరి అభిమానులకి తన వైపు నుంచి ప్రత్యేక విన్నపాన్ని చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వటానికి ప్రయత్నిద్దాం.” అంటూ పోస్ట్ చేశారు. దీంతో తన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. ఈ సినిమా విషయంలో తాము పూర్తి నమ్మకంతో ఉన్నామని ఇప్పటికే నాగవంశీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అమెరికా వేదికగా ‘డాకు మహారాజ్‌’ ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. ఈమేరకు చిత్రబృందం అక్కడికి చేరుకుంది.

Show comments