NTV Telugu Site icon

BJP: డి. శ్రీనివాస్ మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం..

మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేందమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రిగా డీఎస్ అనేక బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. వారితో కలిసి శాసనసభలో పని చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. పార్టీలకు అతీతంగా ఆయన ఉండేవారు.. యువకులను రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. మీరంతా యువకులు.. దేశం కోసం పని చేయండి అని అనేక సార్లు చెప్పారన్నారు. ఆయన గుండె పోటుతో మరణించడం దురదృష్టకరం.. తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తుల్లో ఆయన ఒకరని చెప్పారు. కాంగ్రెస్ లోనే ఉంటూ తెలంగాణ కోసం పోరాడాడని అన్నారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Xi Jinping: ‘పంచశీల’, ‘అలీన విధానం’పై చైనా అధినేత ప్రశంసలు..

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, రెండు సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డీఎస్ అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించిన డీఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డి.శ్రీనివాస్ పాత్ర మరువలేనిదని.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చడంతో పాటు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో డీఎస్ చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం డి. శ్రీనివాస్ నిరంతరం పాటుపడేవారన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని.. డీఎస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.

D. Srinivas: అధికారిక లాంఛనాలతో డి. శ్రీనివాస్ అంత్యక్రియలు..

సీనియర్ రాజకీయనాయకులు, మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కిందస్థాయి నుండి ఎదిగిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారన్నారు. ఆయన కుమారుడు ఎంపీ అరవింద్, వారి కుటుంబసభ్యులకు ఈటల రాజేందర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ రాజకీయ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక బాధ్యతలు మంత్రివర్గంలో విధులు నిర్వహించిన, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల అనారోగ్యంతో నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. వారు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలలో ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు నిరంతరం ప్రజలతో మమేకమై సేవ కార్యక్రమాలలో పాల్గొన్న వ్యక్తి అని అన్నారు. వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ముందుకు సాగాలని.. వారికి భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. డి. శ్రీనివాస్ మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.