Cylinder Blast: బీహార్‌లోని మోతిహారిలో సిలిండర్‌కు మంటలు అంటుకుని పేలింది. దీంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చిన్నారులు సహా 25 మంది గాయపడ్డారు. వంట చేస్తుండగా సిలిండర్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, కొద్దిసేపటికే 25 మందికి పైగా మంటల్లో చిక్కుకున్నారు. ఇద్దరు వ్యక్తులు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. గాయపడిన వారిలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం బెట్టియా జిఎంసిహెచ్‌లో చేర్పించారు.. క్షతగాత్రులకు బెట్టియా జిఎంసిహెచ్‌లో చికిత్స కొనసాగుతోంది. వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయని చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు హడావుడిగా గ్యాస్ సిలిండర్ బయటకు తీశారు. అప్పుడు ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు పూర్తిగా వ్యాపించాయి. మంటల్లో దాదాపు 15 మంది తీవ్రంగా కాలిపోయారు.
Read Also:Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కీలక బాధ్యతలు.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి..
అనంతరం స్థానిక పెద్దలు, గ్రామస్తుల సహకారంతో అందరినీ ఆసుపత్రికి తరలించారు. ఇందులో గాయపడిన 9 మందిని బెట్టియా GMCHకి తీసుకురాగా, 6 మందిని విర్గంజ్ ఆసుపత్రిలో చేర్చారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని జిఎంసిహెచ్ మేనేజర్ షానవాజ్ తెలిపారు.ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలడంతో 15 మందికి గాయాలయ్యాయి. 9 మంది క్షతగాత్రులను జిఎంసిహెచ్‌కి, 6 మందిని విర్‌గంజ్ ఆసుపత్రికి తరలించారు.
Read Also:Mumbai Road Accident: బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి!