NTV Telugu Site icon

Remal cyclone effect: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు రద్దు

Keke

Keke

రెమల్ తుఫాన్ పశ్చిమబెంగాల్ వైపు దూసుకొస్తోంది. ఆదివారం బెంగాల్‌లో తీరం దాటనుంది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. విపత్తును ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను రద్దు చేయాలని కోల్‌కతా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా శనివారం ప్రకటించింది. 21 గంటల పాటు సర్వీసులను నిలిపివేయాలని సూచించింది.

ఇది కూడా చదవండి: IPL: ఫస్ట్ సీజన్లోనే ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్లు వీళ్లే..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మారింది. ఇది ఆదివారం 110-120 కిలోమీటర్ల వేగంతో పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకనుంది. మరోవైపు పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్షపాత హెచ్చరికలు జారీ చేసింది. మే 28 వరకు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: AP DGP: ఏలో పోలీసు శాఖ అలర్ట్.. జిల్లాలకు ప్రత్యేక అధికారుల కేటాయింపు