Site icon NTV Telugu

Cyclone Mentha Effect: ‘మెంథా’ తుఫాను ప్రభావం.. పాఠశాలలకు సెలవులు.. ఏ జిల్లాలో ఎన్ని రోజులంటే..!

Cyclone Menth Effect

Cyclone Menth Effect

Cyclone Mentha Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మెంథా’ తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తుపాను తీవ్రత, వర్షాల పరిస్థితిని బట్టి సెలవుల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తుపాను ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అత్యధికంగా కాకినాడ జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఐదు రోజులు సెలవు ప్రకటించారు. అలాగే కృష్ణా, బాపట్ల, గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో అక్టోబర్ 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇక తూర్పు గోదావరి, అన్నమయ్య, కడప, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్టోబర్ 27, 28 తేదీలలో రెండు రోజులు సెలవులు ప్రకటించడంతో పాఠశాలలు మూసివేయనున్నారు. ఇక పల్నాడు జిల్లాలో కేవలం అక్టోబర్ 27న ఒక రోజు మాత్రమే సెలవు ప్రకటించారు.

Jubilee Hills By Poll Elections 2025: జూబ్లీహిల్స్లో రెండు విడతలుగా సీఎం ఎన్నికల ప్రచారం !

పరిస్థితిని బట్టి సెలవుల విషయంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను కదలికలు, వర్షపాతం తీవ్రత ఆధారంగా ఆయా జిల్లాల అధికారులు సెలవుల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని, అవసరమైతే ఈ సెలవుల సంఖ్యలో మార్పులు లేదా పొడిగింపులు ఉండే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక అధికారుల ప్రకటనలను గమనించాలని సంబంధిత అధికారులు సూచించారు.

CR450 Bullet Train: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్.. గంటకు 450 కి.మీ.ల గరిష్ట వేగంతో..

Exit mobile version