NTV Telugu Site icon

Cyclone Mandous: దూసుకొస్తున్న మాండూస్ తుఫాను.. తమిళనాడులో రెస్క్యూ బృందాలు మోహరింపు

Cyclone

Cyclone

Cyclone Mandous: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను త్వరలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కావేరి డెల్టా ప్రాంతంలోని నాగపట్నం, తంజావూరు, చెన్నై, దాని మూడు పొరుగు జిల్లాలు, కడలూరుతో సహా 10 జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, స్టేట్ ఫోర్స్ నుండి దాదాపు 400 మంది సిబ్బందితో కూడిన 12 బృందాలను మోహరించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొత్తం 24 జిల్లాలో స్కూల్స్ ,కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చెన్నై నుంచి వెళ్ళే 15 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో మాండూస్ ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడు లోతట్టు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి తేలికపాటి వర్షం మొదలైంది. చెన్నై, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుక్కోట్టై , కాంచీపురం, చెంగల్పట్టు, కళ్లకురిచ్చి, తిరుచ్చి, శివగంగై, రామనాథపురం జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను ‘మాండూస్ మరింత ముందుకు కదిలిందని, ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 480 కి.మీ, కరియాకల్ నుంచి 390 కి.మీ దూరంలో వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రదేశాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. తుఫాను పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోట మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో 10వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

Uttarakhand Accident : ఉత్తరాఖండ్ లో ఘోరం.. కాల్వలో పడ్డ కారు.. నలుగురి మృతి

ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా మారుతుందని అంచనా. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. మాండస్ తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు దారీ చేశారు.