NTV Telugu Site icon

Cyclone Fengal: తమిళనాడులో విషాదం నింపిన ఫెంగల్ తుఫాన్.. 18 మంది మృతి‌

Cyclone

Cyclone

Cyclone Fengal: తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్​ వణికించింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్ తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో సోమవారం తమిళనాడులోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. కాగా, తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారడంతో.. నీలగిరి, ఈరోడ్‌‌‌‌‌‌‌‌, కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌, దిండిగల్‌‌‌‌‌‌‌‌, కృష్ణగిరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Read Also: Bangladesh ISKCON: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి.. పరిస్థితి విషమం

ఇక, తమిళనాడులో రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ ఘోర విషాదం నింపింది. భారీ వర్షాల ధాటికి 18 మంది మృతి చెందారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు తిరువన్నమలైలో కొండ చరియలు విరిగిపడ్డాయి పలు ఇళ్లపై.. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. అందులో ఐదుగురు పిల్లలు సహా ఇద్దరు పెద్ద వారి మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇక, నిన్నటి (డిసెంబర్ 2) నుంచి కొండ చరియల కింద ధ్వంసమైన ఇళ్లల్లో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు అధికారులు. దాదాపు 27 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ చేసిన అధికారుల శ్రమకు ఫలితం దొరకలేదు. అలాగే, విల్లుపురంలో వర్షాలకు మరో 8 మంది మృత్యువాత పడ్డారు.

Show comments