Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

Cyclone Arnab Alert Today

Cyclone Arnab Alert Today

Cyclone Arnab Alert Today In AP: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపుబలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాన్‌ ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్‌ స్తంభాల సమీపంలో ఉండకూడదని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. అలాగే పోలవరం, కోనసీమ, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మిగతా జిల్లాల్లో పాఠశాలలు యథావిధిగా కొనసాగనున్నాయి.