Site icon NTV Telugu

Cyber Crime: గూగుల్ మ్యాప్ రివ్యూ వర్క్ ఆఫర్.. రూ.34 లక్షలు మాయం

Cyber Crime

Cyber Crime

Cyber Crime: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.. మరోవైపు ఆన్‌లైన్‌ మోసాలు కూడా కొత్త తరహాలో జరుగుతున్నాయి.. ఉద్యోగం, ఉపాధి, తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం.. ఇలా అనేక రకాలుగా సైబర్‌ నేరగాళ్లు ఎరవేస్తున్నారు.. వారికి ఒక్కసారి చిక్కారంటే.. ఖాతా మొత్తం ఖాళీ చేస్తున్నారు.. మోసపోయిన తర్వాత అసలు విషయం తెలిసి గగ్గోలు పెడుతున్నారు బాధితులు.. ఇప్పటికే లక్షలాది మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి విలవిలలాడిపోయారు.. కొందరు మోసపోయినా బయటకు చెప్పుకోలేని పరిస్థితి..

Read Also: Dasara Festival: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు

తాజాగా ఏలూరులో వెలుగుచూసిన మోసానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరులో ఆన్‌లైన్‌ మోసం జరిగింది.. ఏకంగా ఓ మహిళ రూ. 34 లక్షలు పోగొట్టుకుంది.. గూగుల్ మ్యాప్ రివ్యూ వర్క్ పేరుతో ఆ మహిళకు ఎరవేశాడు చీటర్‌.. మ్యాప్ రివ్యూ వర్క్ నిమిత్తం ఆఫర్ పేరుతో ఓ లింక్‌ను సదరు మహిళకు పంపించాడు.. పెట్టిన ప్రతి పైసాకి 40 శాతం లాభం పొందొచ్చు అంటూ మెసేజ్‌ పెట్టాడు.. అయితే తన ప్లాన్‌లో భాగంగా మొదట ఆ మహిళకు నమ్మకం కలిగేలా చేశారు సైబర్‌ మోసగాళ్లు.. మొదట 500 రూపాయలు పే చేసిన సదరు మహిళకు 40 శాతం లాభం వచ్చినట్టు చూపించారు.. దీంతో.. డబ్బులు భారీగా సంపాదించవచ్చు అనే ఆలోచనలోకి వెళ్లిపోయింది ఆ మహిళ.. దఫదఫాలుగా రూ.34 లక్షల 11 వేల 792 రూపాయలు వారికి ఇస్తూ పోయింది.. అయితే.. ఎంతకీ తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి గగ్గోలు పెడుతూ.. పోలీసులను ఆశ్రయించారు బాధితురాలు. బాధితురాలు కొత్తకోట అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version