సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సరికొత్త ఎత్తుగడలతో బురిడి కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిరక్ష్యరాస్యులే కాదు.. అక్షరాస్యులు కూడా సైబర్ మోసాల భారిన పడుతున్నారు. తాజాగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ సైబర్ వలలో పడ్డారు. ఏకంగా రూ.1.62 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కే షాక్ ఇచ్చిన సైబర్ క్రైమ్ నేరగాళ్లు. రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్‌నే మోసం చేసిన కేటుగాళ్లు. తిరుమల దర్శనం, వసతి కల్పిస్తామని నమ్మించి ఒక వ్యక్తి రూ. 1.62 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు భాదిత ఇన్స్పెక్టర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Cyber Fraud పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కే షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు.. రూ.1.62 లక్షలు వసూలు

Cyber Crime