ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు ప్రధాన నిందితులు అరెస్ట్ అయ్యారు. సైబర్ క్రైమ్ ద్వారా 547 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించిన సత్తుపల్లి ప్రాంతానికి చెందిన నిందితులు. సైబర్ క్రైమ్ లో సత్తుపల్లి,కల్లూరు,వేంసూర్ మండలానికి చెందిన ఆరుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోట్రు మనోజ్ కళ్యాణ్,ఉడతనేని వికాస్ చౌదరి,పోట్రు ప్రవీణ్,మేడ భానుప్రియ, మేడా సతీష్,మోరంపూడి చెన్నకేశవ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:Star Villains : విలన్స్‌గా మారుతోన్న క్రేజీ హీరోలు
గత ఏడాది డిసెంబర్ లో వి ఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో సాయికిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ కేసు వెలుగు చూసింది. నిందితులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన మరో 17 మందిపై కేసులు నమోదు చేశారు. అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో జతకట్టి సైబర్ నేరాలకు పాల్పడ్డట్టు గుర్తించారు.. కాల్ సెంటర్లు నిర్వహిస్తూ సైబర్ క్రైమ్‌లకు పాల్పడ్డారు నిందితులు.. మ్యాట్రిమోని, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
