సైబర్ నేరగాళ్లు అమాయకులనే కాదు ఉద్యోగులను, విద్యావంతులను కూడా బురిడికొట్టిస్తున్నారు. తాజాగా అనంతపురంలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్ల వలకి చిక్కాడు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. సీఐడీ అధికారి అంటూ బెదిరించి రూ. 1.04 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఓబులదేవ నగర్ కి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి మహిళలను వేదిస్తున్నావని, మనీలాండరింగ్ కి పాల్పడ్డావని సైబర్ నేరగాడు కాల్ చేశాడు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు.
Also Read:Harihara Veeramallu : ఇట్స్ అఫీషియల్.. వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్..
కేసు నుంచి తప్పించడానికి కొంత డబ్బులు ఇస్తే వదిలేస్తామని సైబర్ నేరగాళ్లు చెప్పారు. సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి ఈ నెల 16,17,18 తేదీల్లో సైబర్ నెరగాడు చెప్పిన అకౌంట్ కి రూ. 1.04 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. అనంతరం ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అనంతపురం టూ టౌన్ పోలీసులకి పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
