NTV Telugu Site icon

Cyber Cheating: బాసర పేరుతో భారీ దందాకు తెరతీసిన సైబర్ కేటుగాళ్లు

New Project (28)

New Project (28)

Cyber Cheating: చదువుల తల్లి కొలువైన నిర్మల్‌ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వైదిక పండితులు గోమాతకు పూజలు చేసి హోమం నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. గురువారం వరకు బాసరలో వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి. హోటల్ రూం బుకింగుల పేరిట బాసర భక్తులను దృష్టిలో ఉంచుకుని సైబర్ కేటుగాళ్లు చీటింగ్ కు తెరతీశారు. హరిత హోటల్ ఆన్ లైన్ రూమ్ ల బుకింగ్ పేరుతో కొత్త యాప్ సృష్టించారు. క్యూ ఆర్ కోడ్ పంపి డబ్బులు దండుకుంటున్నారు. వారి వలలో పడి పదుల సంఖ్యలో భక్తులు మోస పోతున్నారు. కొంతమంది మోసపోయిన సంగతి గ్రహించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. హరిత హోటల్ బాసర పేరుతో ఓ ఫొటో దాని పైన నంబర్ రోల్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు… రూమ్ బుక్ కావాలంటే డబ్బులు పంపించాలని అడుగుతున్నారు చీటర్స్. అది తెలియక డబ్బులు పంపి మోస పోతున్నారు భక్తులు.

Read Also: Kishan Reddy : కూర్చుని చర్చిద్దాం రండి.. ఎవరేం చేశారో..

చదువుల తల్లి కొలువైన నిర్మల్‌ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వైదిక పండితులు గోమాతకు పూజలు చేసి హోమం నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. గురువారం వరకు బాసరలో వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి. తెల్లవారు జాము ఒకటిన్నర గంటలకు మంగళవాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణంతో పాటు మహా పూజలు నిర్వహిస్తున్నారు. కాగా జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాలకు అర్ధరాత్రే బాసరకు చేరుకున్న భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు దండిగా ఉంటాయని భక్తుల అపారనమ్మకం. అమ్మవారి దర్శనానికి మూడు క్యూలైన్లను అధికారులు సిద్ధం చేశారు. కాగా ఏటా మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటారు. ఆ రోజు చదువుల తల్లి సరస్వతి దేవిని ప్రతిఒక్కరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కాగా దేవాదాయశాఖ తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉదయం 8 గంటలకుకాగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Read Also: Crime News: భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య