NTV Telugu Site icon

Cyber Cirme : స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలు

Cyberfraud (2)

Cyberfraud (2)

జనగామ జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారు.బాధితుల వద్ద నుండి అధిక మొత్తంలో ఆన్లైన్ లావాదేవీ ద్వారా కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నరు. 2024 ఫిబ్రవరిలో జనగామలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో,స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారంటూ ఫోన్ చేసి ఫేక్ మెయిల్ ఐడి తో ఆర్డర్ కాపీని పంపి సైబర్ నేరగాల్లో నమ్మ బలికిస్తున్నారు.నిజమేనని నమ్మి ఇంటర్వ్యూ కొరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు క్యూ కాడుతున్నారు.తీరా అక్కడ ఎలాంటి ఉద్యోగాలు,ఇంటర్వ్యూలు లేవని అధికారులు తెలియజేయడంతో అభ్యర్థులు కంగు తింటున్నారు.జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన ఓ మహిళకు ఇదే తరహాలో ఫోన్ చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారని చెప్పి,ఒక ఫేక్ మెయిల్ ఐడి పేరుతో నకిలీ ఆర్డర్ కాపీని పంపించారు, ఆర్డర్ కాపీ రిజెక్ట్ చేస్తామని, ఉద్యోగం కొరకు 75 వేలు రూపాయలు చెల్లించాలంటూ అడగడంతో ఫోన్ పే ద్వారా డబ్బును ఫైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేసింది.

ఇంటర్వ్యూ కొరకు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి వెళ్ళగా అక్కడ ఎలాంటి ఇంటర్వ్యూలు లేవని అధికారులు తెలియజేయడంతో సదరు మహిళ మోసపోయానని తెలిసి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది.ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని,ఎలాంటి సైబర్ నేరాలకు సంబంధించిన ఫోన్ కాల్స్,మెసేజ్ కి స్పందించొద్దని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగాల పేరిట వస్తున్న ఫోన్ కాల్స్ మోసాలకు గురికాకుండా ఉండేందుకు 100 డయల్ లేదా 1930 టోల్ ఫ్రీ కి సమాచారం అందించాలని తెలిపారు..