జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. పెద్ద సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమానాలు ప్రభావితం అయ్యాయి. టిక్కెట్ల విక్రయాలు కూడా నిలిచిపోయాయి. విమానయాన సంస్థల బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది. జపాన్ ఎయిర్‌లైన్స్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సైబర్ దాడి గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ దాడిని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధృవీకరించారు. అయితే విమానాల ఆలస్యం లేదా రద్దుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్ లేదని ఆయన అన్నారు. కాగా.. జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL) ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ANA) తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ.
READ MORE: Sonu Sood:”నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది”.. రాజకీయరంగ ప్రవేశంపై సోనూసూద్ క్లారిటీ