Site icon NTV Telugu

CV Anand: త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం.. సీవీ ఆనంద్ వార్నింగ్!

Ibomma Telugu

Ibomma Telugu

సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్‌డీ క్వాలితో అభిమానులకు ఐబొమ్మ (బప్పం) అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తగ్గడానికి కూడా పైరసీ సైట్ ఐబొమ్మనే కారణం. మొన్నటివరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్‌లో పెడుతూ వచ్చిన ఐబొమ్మ.. కొద్ది రోజుల నుంచి టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాల థియేటర్ హెచ్‌డీ ప్రింట్‌ను సైతం పైరసీ చేసి రిలీజ్ చేస్తోంది. కొన్నేళ్లుగా టాలీవుడ్‌ను పట్టిపీడిస్తోన్న పైరసీ సైట్‌కు సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు.

భారీ పైరసీ ముఠాలను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను టాలీవుడ్ సినీ పెద్దలకు పోలీసులు వివరించారు. ఈ సమవేశంలో హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నాని, రామ్, నాగచైతన్య.. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పటు పలువురు దర్శకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల పని తీరును పోలీసులు వివరించారు. సినిమాలు థియేటర్ రిలీజ్ రాకముందే హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. హ్యాకర్లకు, పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులే సహకరిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: Tilak Varma: చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా.. కళ్ల ముందు దేశమే కనిపించింది!

మీటింగ్ సందర్భంగా సీవీ ఆనంద్ పైరసీ ముఠాలకు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పారు. ‘ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాను పట్టుకున్నాము. ఐబొమ్మ నిర్వాహకులను సైతం పట్టుకుంటాం’ అని చెప్పారు. ఐబొమ్మకు చెందిన నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు వ్యక్తి ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదట. విషయం తెలిసిన ఐబొమ్మ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ రేట్స్ భారీగా పెంచితే.. సామాన్య జనాలు కుటుంబంతో ఎలా సినిమా చూడాలి? అని సినీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version