Site icon NTV Telugu

Drugs: చిన్నారుల లంచ్ బాక్సులో కోటి విలువైన డ్రగ్స్ సరఫరా..

Drugs

Drugs

డ్రగ్స్ను సరఫరా చేసేందుకు స్మగ్లర్లు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. డబ్బుల కోసం ఎంతటి సాహాసానికైనా వెనుకాడటం లేదు. అయితే.. ఈసారి స్మగర్లు చిన్న పిల్లల లంచ్ బాక్స్ లో డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఆ బాక్స్ కస్టమ్ అధికారుల కంటపడింది. అందులో ఏముందోనని తెరిచి చూడగా.. రూ. కోటి కంటే ఎక్కువ విలువ చేసే డ్రగ్స్ లభ్యమైంది.

Read Also: Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ.. అందులో ఏముందంటే..!

శనివారం అహ్మదాబాద్‌లో చిన్నారుల బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లలో దాచి ఉంచిన రూ. 1.15 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక స్మగ్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Dowleswaram Barrage: ఖరీఫ్ పంట రైతులకి శుభవార్త.. సాగు నీటిని విడుదల చేసిన అధికారులు

అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌తో పాటు కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాలు సంయుక్త ఆపరేషన్‌లో డ్రగ్స్ దందా బయటపడింది. కెనడా, యుఎస్ఏ, థాయ్‌లాండ్ నుండి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అనంతరం గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైబ్రిడ్, సింథటిక్ గంజాయి ఉన్న ప్యాకెట్లను ఫారిన్ పోస్ట్ ఆఫీస్ నుండి స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version