NTV Telugu Site icon

Curry And Cyanide : ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2023 12 25 At 12.06.36 Pm

Whatsapp Image 2023 12 25 At 12.06.36 Pm

ఓటీటీ ప్రేక్షకులు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ మరియు వెబ్ సిరీస్‌ అంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు. కొంతమంది మూవీ లవర్స్ వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. వారికోసమే అన్నట్లుగా తాజాగా ఓ రియల్ క్రైమ్ స్టోరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చి అలరిస్తోంది.కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని ఇప్పటికే చాలా మంది సినిమా గా తెరకెక్కించారు. మరికొందరు డాక్యుమెంటరీ మరియు సీరియల్‌గా కూడా మలిచి విడుదల చేశారు.ఈ కేరళ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇప్పటికీ మూడు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఓ డాక్యుమెంటరీ వచ్చింది. అదే “కర్రీ అండ్ సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్”. కేరళలోని కోజికోడ్ కూడతాయి గ్రామానికి చెందిన జూలీ జోసేఫ్ 14 సంవత్సరాల్లో మొత్తం 6 హత్యలు చేసింది. తన కుటుంబ సభ్యులనే తాను హత్య చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

ముఖ్యంగా ఆమె ఆరు హత్యలు ఎలా చేసింది, ఎందుకు చేసిందో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.. ఈ రియల్ క్రైమ్ కథను ఆధారంగా తీసుకునే అనేక సినిమాలు రాగా తాజాగా “కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్” పేరుతో వచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కర్రీ అండ్ సైనైడ్ డిసెంబర్ 22 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ మరియు ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.జూలీ జోసేఫ్ తన కుటుంబ సభ్యులనే సైనైడ్ పెట్టి చంపేస్తుంది. ఆమె వారికి సైనైడ్ ఎలా ఇచ్చింది, ఆ హత్యలను ఏవిధంగా కవర్ చేసింది. చివరకు ఆమె పోలీసులకు ఎలా చిక్కింది వంటి అనేక ఆసక్తిర అంశాలతో కర్రీ అండ్ సైనైడ్ తెరకెక్కింది. ఇదిలా ఉంటే 2019లో జూలీతో పాటు ఆమెకు సైనైడ్ సరఫరా చేసిన మరో ఇద్దరు నిందితులు ఎమ్ ఎస్ మాథ్యూ మరియు ప్రాజీ కుమార్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు.