ఒక ప్రమాదం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కానుగమాకులపల్లెలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ ఇంట్లో గృహప్రవేశానికి వేసిన షామియానా గాలికి ఎగిరి 11కేవి విద్యుత్ లైన్ పై పడడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బీ కొత్తకోట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రికి నలుగురిని తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో కానుగమాకులపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. శుభకార్యం జరగాల్సిన చోట విషాదం నెలకొంది.
Read Also: Bhatti Vikramarka : ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. త్వరలో తిరుగుబాటు రానుంది
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరివేసుకుని మృతి చెందిన సంతోష్ నాయక్ తల్లిదండ్రులు,బంధువులు ఆందోళనకు దిగారు. సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాల ఎదురుగల శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ధర్నా చేస్తున్నారు సంతోష్ నాయక్ తల్లిదండ్రులు,బంధువులు. దీంతో భారీగా నిలిచి పోయాయి వాహనాలు. శ్రీశైలానికి చెందిన ఓ మహిళతో మృతుడు సంతోష్ ప్రేమ వ్యవహారంతోనే హత్య చేసి ఉరి వేశారని ఆరోపణ.. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని రహదారి దిగ్బంధం చేశారు. నిన్నటి నుంచి శవ పరీక్ష నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Wedding Ceremony : పెళ్లికి వచ్చి.. పెట్టింది తిన్నారు.. వచ్చిన కట్నాలతో ఉడాయించారు