యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక, ఇంగ్లీష్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు కుప్పకూలిపోయింది. బెన్ స్టోక్స్ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరిగా పోరాటం చేశాడు. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ ని ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
Read Also: Pakistan: పాకిస్థాన్‌లో కుండపోత వర్షాలు.. 50 మంది మృతి
మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులతో రెండో రోజు ఆటను ఇంగ్లండ్ జట్టు ప్రారంభించిన కొద్దిసేపటికే జో రూట్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు పడినప్పటికి ఒక ఎండ్‌లో ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాత్రం నిలకడగా ఆడాడు. 168 పరుగుల వద్ద మార్క్‌వుడ్ ఎనిమిదో వికెట్ రూపంలో పెవిలియన్ కు వెళ్లగానే బెన్ స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకంజలో ఉంది.
Read Also: Madhu Yaskhi Goud: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బిఆర్ఎస్ పార్టీది
క్రీజులో కుదురుకున్న బెన్ స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లోనే 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో రెచ్చిపోయాడు. తన దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు అతడు. బెన్ స్టోక్స్ మినహా మిగతా బ్యాటర్లలో జాక్ క్రాలీ 33, మార్క్ వుడ్ 24, మొయిన్ అలీ 21 పరుగులు చేశారు. పాట్ కమిన్స్ మాత్రం ఇంగ్లండ్ బ్యాటర్ల నడ్డి విరిచి ఏకంగా ఆరు వికెట్లు తీశాడు.. మిచెల్ స్టార్క్ రెండు, టాడ్ మర్ఫీ, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సెంచరీతో రాణించాడు.
