NTV Telugu Site icon

CUET UG Results 2022: సెప్టెంబర్‌ 15 నాటికి కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు

Cuet Ug Results

Cuet Ug Results

CUET UG Results 2022: అండర్ గ్రాడ్యుయేట్‌ల కోసం కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ) పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 15 నాటికి ప్రకటించాలని భావిస్తున్నట్లు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అండర్ గ్రాడ్యుయేట్‌ల కోసం నిర్వహించిన కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను సెప్టెంబరు 15 నాటికి లేదా వీలైతే, రెండు రోజుల ముందుగానే ప్రకటించాలని భావిస్తున్నారు. పాల్గొనే అన్ని విశ్వవిద్యాలయాలు సీయూఈటీ-యూజీ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించడానికి తమ వెబ్ పోర్టల్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి. ,” అని యూజీసీ ఛైర్మన్ అన్నారు.

“ప్రాథమిక నివేదికల ప్రకారం, ఇంటర్నెట్ వేగం మందగించడం వల్ల, సెంటర్ రాధా గోవింద్ విశ్వవిద్యాలయం, రామ్‌ఘర్, జార్ఖండ్‌లో పరీక్ష నిర్వహించబడలేదు. వివరణాత్మక నివేదిక కోసం వేచి ఉంది. 103 మంది అభ్యర్థులకు పరీక్ష త్వరలో నిర్వహించబడుతుంది,” అని ఆయన చెప్పారు.కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అండర్ ​గ్రాడ్జ్యూయేషన్​ కోర్సుల ప్రవేశాల కోసం సీయూఈటీ యూజీని నిర్వహిస్తున్నారు. సీయూఈటీ అంటే.. కామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​.

Dudhsagar Falls: వావ్.. గోవాలోనే మరో టూరిస్ట్‌ స్పాట్‌ ..! అక్కడకు ట్రైన్

దేశంలో సీయూఈటీ యూజీ జరగడం ఇదే తొలిసారి. జులై 14 నుంచి ఆగస్టు 30 వరకు.. దేశంలోని 510కిపైగా నగరాల్లో సీయూఈటీ యూజీ పరీక్ష జరిగింది. 12వ తరగతి మార్కుల కన్నా.. ఈ సీయూఈటీ యూజీ ఫలితాల్లో వచ్చే స్కోరు ఆధారంగానే వర్సిటీలు అడ్మిషన్లు తీసుకోవాలని యూజీసీ ఈ ఏడాది మార్చ్​లో ప్రకటించింది. అయితే.. మినిమం స్కోరు ఎంత ఉండాలి? అన్న విషయాన్ని వర్సిటీలకు వదిలేసింది. 2022-23 విద్యాసంవత్సరం కోసం సీయూఈటీ యూజీ ఫస్ట్​ అడిషన్‌లో 44 కేంద్ర వర్సిటీలు, 12 రాష్ట్ర వర్సిటీలు, 11 డీమ్డ్​ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలు పాల్గొన్నాయి.

ఈ సీయూఈటీ యూజీ పరీక్ష కోసం 18లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఇప్పుడు సీయూఈటీ యూజీ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి సీయూఈటీ యూజీ ఫలితాలు ఈ నెల 9లోపే వస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు.