NTV Telugu Site icon

CSK vs PBKS: బ్యాటింగ్ లో దుమ్మురేపిన సీఎస్కే.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

Csk Batters

Csk Batters

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకి 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్య ఛేదనతో పంజాబ్ కింగ్స్ జట్టు బరిలోకి దిగింది. ఈ సీజన్ లో ఇరు జట్లు చెరో ఎనిమిది మ్యాచ్ లు ఆడాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఐదు విజయాలు.. మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. నాలుగు మ్యాచ్ ల్లో గెలిచిన పంజాబ్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో సీఎస్కే గెలిస్తే మళ్లీ టాప్ ప్లేస్ కి చేరే అవకాశం ఉంది.

Also Read : Adinarayana Reddy: 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ

చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 52 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ తో 92 పరుగులు ) సెంచరీకి 8 పరుగుల దూరంలో నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ ( 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ తో 37 పరుగులు ), శివమ్ దూబే ( 28: 17బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు ) రాణించారు. ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోని ( 4 బంతుల్లో 2 సిక్స్ లతో 13 పరుగులు ) వరుసగా రెండు సిక్స్ లు కొట్టడంతో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మారుమోగిపోయింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, సామ్ కర్రన్, రాహుల్ చహర్, సికిందర్ రజా తలో వికెట్ తీసుకున్నారు.

Also Read : Ukraine ‘Maa Kali’ tweet: “కాళీ మాత” ఫోటోతో వివాదాస్పద ట్వీట్ చేసిన ఉక్రెయిన్.. భారతీయుల ఆగ్రహం

ధోని బ్యాంగ్‌తో ముగించే వరకు అతను చివరి మూడు ఓవర్లు చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు! చివరి రెండు బంతుల్లో అతని వరుస సిక్సర్లు CSKని 200 పరుగులకు చేర్చాయి. కాన్వే మరో ఎండ్‌లో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. బ్యాటింగ్ అనంతరం సీఎస్కే ఓపెనర్ డేవాన్ కాన్వే మాట్లాడుతూ.. మంచి వికెట్. బౌలర్లు హార్డ్ లెంగ్త్ వేయడంతో ఆరంభంలో కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేశాం.. ఖచ్చితంగా (జట్టు కోసం బ్యాటింగ్‌లో మరియు 100 కోసం కాదు) టీమ్ కోసం మంచి ఇన్సింగ్స్ ఆడాను.. అది (ధోని రెండు సిక్సర్లు) పార్క్ వెలుపలికి కొట్టినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన బాగుందని డేవాన్ కాన్వే అన్నాడు.
కాన్వే చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో అతనికి ఇది 5వ అర్ధశతకం.

Show comments