Site icon NTV Telugu

IPL 2023 Csk vs Srh : చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ ఢీ

Csk Vs Srh

Csk Vs Srh

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఇవాళ ( శుక్రవారం ) కీలక మ్యాచ్ కు చెన్నై వేదికగా మారింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ కీలక లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ లో ఇది 29వ మ్యాచ్.. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోర్ సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. కానీ చివరకు ఆర్సీబీని 218 పరుగులకే కట్టడి చేసింది. 8 పరుగుల తేడాతో ఓడించింది.

Also Read : Rajastan : భార్య తీరుపై అనుమానంతో భర్త షాకింగ్ డెసిషన్

చెన్నైకి చెందిన ఓపెనర్ డేవిన్ కాన్వే దంచి కొట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే శివమోత్తాడు. ఆర్సీబీ బౌలర్ల భరతం పట్టారు. ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీం చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 192 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు 178 పరుగులకే పరిమితమై పోయింది. 14 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

Also Read : Imran Khan: ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ కిడ్నాప్

అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఎలాగైన సరే చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపొందాలని ఉవ్విళ్లూరుతుంది. మరో వైపు ఆర్సీబీని ఓడించి మంచి జోష్ మీదుంది చెన్నై టీమ్. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటి వరకు 18 మ్యాచ్ లు జరిగాయి. కాగా.. చెన్నై 13 సార్లు గెలిస్తే.. హైదరాబాద్ మాత్రం కేవలం 5 సార్లు మాత్రమే విజయం సాధించింది. మంచి బ్యాటింగ్ లైనఫ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆల్ రౌండ్ షోతో సీఎస్కేను కట్టడి చేస్తామంటూ ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ మార్ర్కమ్ పేర్కొన్నాడు.

Exit mobile version