CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK vs SRH: చెన్నై వేదికగా జరుగుతున్న సీఎస్కే-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడినా, మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ దిశగా సాగలేకపోయింది. అయితే చివర్లో డేవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు పోటీ స్కోర్ అందించాడు.
ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 13 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ తో 27 పరుగులు చేసి వేగంగా ఆరంభం ఇచ్చాడు. మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ 21 బంతుల్లో 15 పరుగులకే పరిమితమయ్యాడు. ఉర్విల్ పటేల్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. మధ్య ఓవర్లలో కార్తిక్ శర్మ దూకుడుగా ఆడి 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. చివర్లో డేవాల్డ్ బ్రెవిస్ చెలరేగిపోయాడు. 27 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 44 పరుగులు చేసి సీఎస్కే స్కోర్‌ను వేగంగా ముందుకు నడిపించాడు. ఇక శివమ్ దూబే కూడా 26 పరుగులతో మంచి6 ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
చివర్లో సీఎస్కే వరుస వికెట్లు కోల్పోయినా 180 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. సకీబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఈషాన్ మలింగ, ప్రఫుల్ హింగే తలో వికెట్ సాధించారు.
తాజావార్తలు
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!