Dhoni Jersey: ధోనికి సీఎస్‌కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..

Ms Dhoni

Ms Dhoni

భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సేవలకు గుర్తింపుగా ఆ జట్టు యాజమాన్యం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ధోని ధరించిన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని రిటైర్ చేస్తున్నట్లు సీఎస్‌కే ప్రకటించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 19 ఏళ్ల పాటు ధోని ఇదే నంబర్ జెర్సీతో బరిలోకి దిగి అద్భుతమైన విజయాలను అందించారు. ఆయన కెప్టెన్సీలో సీఎస్‌కే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను కైవసం చేసుకోవడంతో పాటు అత్యధిక సార్లు ప్లేఆఫ్స్, ఫైనల్స్‌కు చేరుకుంది.

ధోని తన పుట్టినరోజు అయిన జూలై 7 (7వ నెల, 1981 సంవత్సరం, 8-1=7) ప్రాతిపదికన ఈ నంబర్‌ను ఎంచుకున్నట్లు గతంలో వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో బీసీసీఐ ఇప్పటికే 2020లో ధోని నంబర్ 7 జెర్సీని రిటైర్ చేయగా, తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా అదే బాటలో నడిచింది.

ఐపీఎల్ చరిత్రలో ఇలా జెర్సీలను రిటైర్ చేయడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు ముంబై ఇండయన్స్ జట్టు సచిన్ టెండూల్కర్ గౌరవార్థం నంబర్ 10 జెర్సీని రిటైర్ చేసింది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఏబీ డివిలియర్స్ నంబర్ 17, క్రిస్ గేల్ నంబర్ 333 జెర్సీలను పక్కన పెట్టింది. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఆండ్రీ రసెల్ నంబర్ 12 జెర్సీని రిటైర్ చేసింది. ఈ వరుసలో ఇప్పుడు సీఎస్‌కే కూడా చేరి ధోనిపై తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకుంది.