Site icon NTV Telugu

CSK New Captain 2026: 2026 ఐపీఎల్‌కు కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సీఎస్‌కే యాజమాన్యం..

Csk New Captain 2026

Csk New Captain 2026

CSK New Captain 2026:
సీఎస్‌కే టీంకు కొత్త కెప్టెన్‌గా సంజు శాంసన్ రావచ్చు అనే పుకార్లకు చెక్ పెడుతూ ఈ రోజు సీఎస్‌కే యాజమాన్యం జట్టుకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఇంతకీ ఐపీఎల్‌లో సీఎస్‌కే టీంకు కొత్త కెప్టెన్ ఎవరని అనుకుంటున్నారు.. రుతురాజ్ గైక్వాడ్. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సీఎస్‌కే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నారని యాజమాన్యం ప్రకటించింది. ఈ ఫ్రాంచైజీ.. జట్టు ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియా పోస్ట్ ఈ ప్రకటన వెలువడింది.

READ ALSO: HYDRA : సుద్దకుంట మార్కింగ్స్ తొలగింపు.. ప్రజలకు హైడ్రా కమిషనర్ ధీమా

పుకార్లకు చెక్..
2026 సీజన్ కు ముందు జరిగే మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్‌కే జట్టుకు మారిన సంజు శాంసన్ CSK కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టవచ్చని పుకార్లు వచ్చాయి. క్రికెట్ పండితులు కూడా సంజు తన నాయకత్వ పాత్ర గురించి హామీలు అందుకున్న తర్వాతే సూపర్ కింగ్స్‌లో చేరడానికి అంగీకరించాడని అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహిస్తారని చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో ధృవీకరించింది. 2024 ఐపీఎల్ సీజన్‌లో సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో సీఎస్‌కే ప్లేఆఫ్ స్థానాన్ని కోల్పోయింది. అలాగే ఆయన 2025 సీజన్‌లో కూడా జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే టోర్నీ మధ్యలో గాయం కారణంగా జట్టును విడిచిపెట్టాల్సి వచ్చింది. దీని తర్వాత జట్టును ఎంఎస్ ధోనీకి నడిపించాడు.

ఐపీఎల్‌లో గైక్వాడ్ ప్రదర్శన..
IPL 2025లో CSK నిరాశపరిచే ప్రదర్శనను చేసింది. IPL చరిత్రలో మొదటిసారిగా CSK 2025లో అట్టడుగు స్థానంలో నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా CSKలో అత్యంత స్థిరమైన బ్యాట్స్‌మెన్‌లలో రుతురాజ్ గైక్వాడ్ ఒకరు. 2020లో అరంగేట్రం చేసినప్పటి నుంచి గైక్వాడ్ 71 మ్యాచ్‌ల్లో 40.35 సగటు, 137.47 స్ట్రైక్ రేట్‌తో 2502 పరుగులు చేశాడు.

READ ALSO: IPL 2026 Squads: ఐపీఎల్‌ జట్టుల్లో ఆటగాళ్ల ముఖాలు మారాయ్.. ఏ ఆటగాడు ఏ జట్టులో ఉన్నాడంటే!

Exit mobile version