NTV Telugu Site icon

CSK Fan Died: ముంబై అభిమానుల దాడి.. సీఎస్‌కే అభిమాని మృతి!

Btesh Student Manoj Dead

Btesh Student Manoj Dead

CSK Fan Murdered by two MI Fans: ఐపీఎల్ మ్యాచ్‌లో తలెత్తిన తీవ్ర వాగ్వాదం ఒక వ్యక్తి మరణానికి దారితీసింది. ఇటీవల ముంబై ఇండియన్స్‌ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సీఎస్‌కే అభిమాని అసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం (మార్చి 31) మరణించాడు. సీఎస్‌కే అభిమాని మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మార్చి 27న ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా హన్మంత్‌వాడికి చెందిన బందోపంత్‌ బాపూసో తిబిలే (63) అనే వ్యక్తి టీవీలో చూశాడు. హన్మంత్‌వాడికే చెందిన సాగర్‌ సదాశివ్‌ జంజగే (35), బల్వంత్‌ మహదేవ్‌ జంజగేతో (50) కూడా తిబిలేతో మ్యాచ్ వీక్షించారు. తిబిలే సీఎస్‌కేకు వీరాభిమాని కాగా.. సాగర్‌, బల్వంత్‌ ముంబై అభిమానులు. ఆ మ్యాచ్‌లో ముంబై స్టార్ ఆటగాడు రోహిత్‌ శర్మ ఔటైనప్పుడు తిబిలే హేళనగా మాట్లాడి.. సంబురాలు చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన సాగర్‌, బల్వంత్‌లు తిబిలేపై కర్రలతో దాడి చేశారు.

Also Read: MI vs RR Dream 11 Prediction: ముంబై vs గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

బాపూసో తిబిలే తలకు బలమైన గాయమై స్పృహతప్పి నేలపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన తిబిలే సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తిబిలే ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచాడు. కేసు నమోదు చేసిన కార్వీర్ పోలీసులు.. సాగర్‌, బల్వంత్‌లను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఈ ఇద్దరికి రిమాండ్‌ విధించింది.

Show comments