CSK Fan Died: ముంబై అభిమానుల దాడి.. సీఎస్‌కే అభిమాని మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Fan Murdered by two MI Fans: ఐపీఎల్ మ్యాచ్‌లో తలెత్తిన తీవ్ర వాగ్వాదం ఒక వ్యక్తి మరణానికి దారితీసింది. ఇటీవల ముంబై ఇండియన్స్ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సీఎస్‌కే అభిమాని అసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం (మార్చి 31) మరణించాడు. సీఎస్‌కే అభిమాని మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి 27న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా హన్మంత్‌వాడికి చెందిన బందోపంత్ బాపూసో తిబిలే (63) అనే వ్యక్తి టీవీలో చూశాడు. హన్మంత్‌వాడికే చెందిన సాగర్ సదాశివ్ జంజగే (35), బల్వంత్ మహదేవ్ జంజగేతో (50) కూడా తిబిలేతో మ్యాచ్ వీక్షించారు. తిబిలే సీఎస్‌కేకు వీరాభిమాని కాగా.. సాగర్, బల్వంత్ ముంబై అభిమానులు. ఆ మ్యాచ్‌లో ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఔటైనప్పుడు తిబిలే హేళనగా మాట్లాడి.. సంబురాలు చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన సాగర్, బల్వంత్‌లు తిబిలేపై కర్రలతో దాడి చేశారు.
Also Read
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
- CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
Also Read: MI vs RR Dream 11 Prediction: ముంబై vs గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
బాపూసో తిబిలే తలకు బలమైన గాయమై స్పృహతప్పి నేలపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన తిబిలే సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తిబిలే ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచాడు. కేసు నమోదు చేసిన కార్వీర్ పోలీసులు.. సాగర్, బల్వంత్‌లను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఈ ఇద్దరికి రిమాండ్ విధించింది.
తాజావార్తలు
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?