CS Shanti Kumari: రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CS Shanti Kumari: రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, డా. సుఖ్ బీర్ సింగ్ సంధులతో కలసి నేడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, డీజీపీ రవీ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Read Also: Jupalli Krishna Rao: మాజీ సీఎం కేసీఆర్‌పై జూపల్లి ఫైర్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివరించారు. రాష్ట్రంలో మొత్తం మీద శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, భూపాల పల్లి, ములుగు జిల్లాలపై, పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్‌తో సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు, తెలంగాణకు 860 కిలోమీటర్ల నాలుగు రాష్ట్రాల సరిహద్దు ఉందని, 154 చెక్ పోస్టులు తెరిచామని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా శాఖలు సరిహద్దు రాష్ట్రాలతో కోఆర్డినేషన్ సమావేశాలను నిర్వహించాయని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రూ.69.66 కోట్లను స్వాధీన పర్చుకున్నామని, వీటిలో రూ. 27.38 కోట్ల నగదు, 10 కోట్ల విలువైన మద్యం, రూ.16 .14 కోట్ల విలువైన డ్రగ్స్, నార్కోటిక్స్ స్వాధీన పర్చుకోగా, రూ. 7 .49 కోట్ల విలువైన మెటల్స్‌ను స్వాధీన పర్చుకున్నామని వివరించారు. రాష్ట్రానికి 60 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలు వచ్చాయని, మరో 100 కంపెనీల బలగాలు త్వరలోనే రానున్నాయని వివరించారు. మార్చి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు 6022 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలియజేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!