NTV Telugu Site icon

Andhra Pradesh: పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. డయేరియా కట్టడిపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Ap News

Ap News

Andhra Pradesh: డయేరియా నివారణ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. డయేరియా కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు, ఓహెచ్ఎస్ఆర్ లీకేజీలు లేకుండా చూడాలని ఏపీ సీఎస్ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్ అధికారులకు సూచించారు.

Read Also: Vangalapudi Anitha: ఈపూరుపాలెంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి

217 వాటర్ సోర్సుల్లో నీటి కాలుష్యం ఉన్నట్టు గుర్తించామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. జులై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. పీఆర్ అండ్ ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచనలు చేశారు. గత నాలుగు నెలల కాలంలో గుంటూరు, విజయవాడ, కాకినాడ, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని సీఎస్ పేర్కొన్నారు. అనేక మంది అనారోగ్యం పాలై ఆసుపత్రిల్లో చేరారని, ఫిబ్రవరిలో ఒక వ్యక్తి డయేరియాతో చనిపోయారని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులను ఆదేశించారు.