Crude Oil and Gas Prices Drop: గుడ్‌న్యూస్.. దిగివస్తున్న చమురు ధరలు.. తగ్గుతున్న గ్యాస్ రేట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crude Oil and Gas Prices Drop: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, సహజ వాయువు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి.. హార్మూజ్ జలసంధి విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో మార్కెట్లలో భారీ మార్పులు నమోదయ్యాయి. ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ అమల్లో ఉన్నంతకాలం హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలకు అనుమతి ఇస్తామని ప్రకటించడంతో చమురు ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ఇప్పటివరకు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఉన్న ముడి చమురు ధరలు ఒక్కసారిగా 86 డాలర్ల వరకు దిగివచ్చాయి. అనంతరం కొంత కోలుకుని 90 డాలర్లకు చేరుకున్నాయి.
చమురు ధరల్లో భారీ పతనం
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 10.48 శాతం తగ్గి 88.97 డాలర్లకు చేరింది. సెషన్ మధ్యలో ఇది 86.09 డాలర్ల కనిష్ట స్థాయిని తాకింది. అలాగే WTI క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 12.12 శాతం పడిపోయి 83.21 డాలర్లకు చేరింది. ఇది ఇటీవల కాలంలో ఒక్కరోజులో నమోదైన అతిపెద్ద పతనంగా చెబుతున్నారు.
Also Read
- Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
- Sajjad Nomani: హిందువులు దేశంలో మెజారిటీ కాదు.. మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
గ్యాస్ ధరలు కూడా తగ్గుముఖం
చమురు ధరలతో పాటు సహజ వాయువు ధరలు కూడా తగ్గాయి. ఎల్ఎన్‌జీ ధరలు 2.624 డాలర్ల వరకు దిగివచ్చాయి. అయితే తర్వాత కొంత పెరిగి 2.674 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మొత్తంగా గ్యాస్ మార్కెట్‌లో కూడా ఒత్తిడి కనిపించింది.
హార్మూజ్ జలసంధిపై మళ్లీ అనిశ్చితి
ఇక శనివారం ఉదయం Mohammad Bagher Ghalibaf హార్మూజ్ జలసంధిని అమెరికా ఆదేశాల ప్రకారం కాకుండా, ఇరాన్ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అమెరికా ఆంక్షలు కొనసాగితే జలసంధిని మూసివేసే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన విమర్శించారు. ఈ తాజా పరిణామాలతో సోమవారం నుంచి చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
స్టాక్ మార్కెట్లపై ప్రభావం
హార్మూజ్ జలసంధి తెరుచుకుంటుందనే వార్తలతో అమెరికా మార్కెట్లు 2 శాతం పైగా లాభపడ్డాయి. అదే సమయంలో భారత మార్కెట్ సూచిక అయిన గిఫ్ట్ నిఫ్టీ కూడా బలమైన సంకేతాలు ఇస్తోంది. సోమవారం భారత మార్కెట్‌లో సుమారు 300 పాయింట్ల గ్యాప్-అప్‌తో ప్రారంభమయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ధరలు తగ్గితే భారత్ వంటి దిగుమతి దేశాలకు ఊరట లభిస్తుంది. ఇంధన ధరలపై కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
-
Sajjad Nomani: హిందువులు దేశంలో మెజారిటీ కాదు.. మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Mahendragiri Varahi: మైండ్ బ్లాక్ చేస్తున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’!
-
Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
-
Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!