Site icon NTV Telugu

CRPF Jawan Arrest: దేశ భద్రత విషయంలో CRPF జవాన్‌ను అరెస్ట్ చేసిన NIA..!

Nia

Nia

CRPF Jawan Arrest: దేశ భద్రత విషయంలో పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు భారతదేశ భద్రత విషయం సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించిన కేసులో CRPF సిబ్బందిలోని మోటి రామ్ జాట్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. ఇందుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 నుండి మోటి రామ్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడని, అతడు గత కొంత కాలంగా జాతీయ భద్రతకు సంబంధించిన కొన్ని సీక్రెట్ సమాచారాన్ని వారితో పంచుకునే వాడని తెలిపింది. ఇక భద్రత విషయాలను అతను పాక్ కు చేరవేసిందకు గాను.. అతడికి అధికారుల నుంచి వివిధ మార్గాల ద్వారా డబ్బులు వచ్చినట్లు NIA వెల్లడించింది.

Read Also: AI Blackmail Developer:నీ అక్రమ సంబంధాలను బయట పెడతా జాగ్రత్త.. డెవలపర్ను బెదరించిన ఏఐ..!

ఇక కేసును విచారిస్తున్న NIA అధికారుల బృందం పూర్తి ఆధారాలతో.. న్యూఢిల్లీలో మోటి రామ్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఇక విచారణ అంతరం కోర్టు అతడిని జూన్ 6 వరకు NIA కస్టడీకి అప్పగించేలా తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిందుతుడిని దేశ భద్రత విషయం సంబంధించిన అనేక వివరాలను, అతడు ఎలాంటి సమాచారాన్ని పంచుకున్నాడు వంటి విషయాలను విచారణలో తెలుసుకోనున్నారు.

Read Also: Best Camera Phones: కలర్‌ఫుల్‌ మెమరీస్‌కు రూ.15,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..!

Exit mobile version