వ్యవసాయ శాఖ అధికారులు తమ చేతివాటం చూయించారు. రైతుల ఖాతాల్లో జమకావాల్సిన పంట నష్టం సొమ్మును దారిమళ్లించారు. నకిలీ ఖాతాల్లో జమ చేసుకుని కాజేశారు. ఈ విషయం కాస్త రైతులకు తెలియడంతో ఆందోళనకు దిగారు. ఈ ఉదాంతం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. తమను అధికారులు నట్టేట ముంచేశారని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం రైతులను వాపోయారు. గత వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తమ ఖాతాలో జమ అవ్వవలసిన నష్టపరిహారం సొమ్మును గోల్మాల్ చేశారంటూ అగ్రికల్చర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
READ MORE: Rahul Gandhi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తాం..
గత వర్షాలకు పంట నష్టపోయిన రైతుల ఖాతాలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించింది. పెడన మండలం మార్కెట్ యాడ్ లో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ యార్లగడ్డ నాగ మల్లేశ్వరావు ఆ డబ్బులు కాజేశారన్న ఆరోపణలున్నాయి. అతడు తన బంధువులు స్నేహితులు తదితర సాయాంతో ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు జిరాక్స్ లు తీసుకొని.. రైతులకు పడవలసిన నష్టపరిహారం ఫేక్ అకౌంట్ లో పడేవిధంగా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి గల కారణం ఆ శాఖ చెందిన అగ్రికల్చర్ అధికారి ఏఓ ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది రైతులు ఏవో వద్ద శ్రీనివాసరావు వద్ధ ఆందోళనకు దిగారు. చిన్న సన్న కారు రైతులకు వారి నష్టపరిహారం ఎకరానికి రూ.₹ 6000 పడగా…కొంతమందికి ఎనిమిది వేల రూపాయలు కూడా జమయ్యాయి. మరి కొంతమంది రైతులకు రూ.32 వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా వారి ఖాతాలో పడినట్లు సమాచారం. అసలు పొలం లేని వారికి ఖాతాలో ఎలా వచ్చాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.