ఫిఫా వరల్డ్‌కప్‌లో భారీ షాక్.. Cristiano Ronaldo ప్రభావం శూన్యం.. పోర్చుగల్ విజయాన్ని అడ్డుకున్న కాంగో.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cristiano Ronaldo: ఫిఫా వరల్డ్‌కప్ 2026లో పోర్చుగల్ జట్టు తన ప్రయాణాన్ని ఆశించిన విధంగా మొదలు పెట్టలేకపోయింది. గ్రూప్-Kలో భాగంగా అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని NRG స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది పోర్చుగల్. మ్యాచ్ మొత్తంలో బంతిపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. కాంగో జట్టు కట్టుదిట్టమైన డిఫెండ్ ను ఛేదించడంలో పోర్చుగల్ విఫలమైంది.
మ్యాచ్ మొదలైన 6 నిమిషాలకే పోర్చుగల్ ఆధిక్యంలోకి వెళ్లింది. పెడ్రో నెటో ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను జోవో నెవెస్ గోల్‌గా మలచడంతో పోర్చుగల్‌కు శుభారంభం లభించింది. బ్రూనో ఫెర్నాండెస్, విటిన్హా మధ్యమైదానంలో చక్కటి సమన్వయంతో ఆటను నడిపిస్తూ కాంగోపై ఒత్తిడి పెంచారు. అయితే క్రమంగా కాంగో ఆటలోకి తిరిగి వచ్చింది. డిఫెండ్ లో పటిష్టంగా నిలిచిన ఆ జట్టు పోర్చుగల్‌కు స్పష్టమైన అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకుంది. తొలి అర్ధభాగం ముగియడానికి క్షణాల ముందు వచ్చిన కార్నర్‌ను యోనే విస్సా అద్భుత హెడ్డర్‌తో గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. తొలి అర్ధభాగంలో పోర్చుగల్ 72% బంతి ఆధిపత్యం కలిగి ఉన్నప్పటికీ.. ఆ ఆధిక్యాన్ని మరిన్ని గోల్స్‌గా మార్చుకోలేకపోయింది.
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
రెండో అర్ధభాగంలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. పోర్చుగల్ బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ.. కాంగో రక్షణను ఛేదించలేకపోయింది. మరోవైపు కౌంటర్ అటాక్స్ తో కాంగో అప్పుడప్పుడు ప్రమాదకరంగా మారింది. ప్రత్యామ్నాయ ఆటగాడు సెడ్రిక్ బకాంబు చివరి నిమిషాల్లో చేసిన ప్రయత్నం కాస్త తేడాతో బయటకు వెళ్లడంతో పోర్చుగల్ ఓటమి నుంచి తప్పించుకుంది.
మ్యాచ్ అనంతరం ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం క్రిస్టియానో రొనాల్డో ప్రదర్శనే. పోర్చుగల్ స్టార్ ఫార్వర్డ్ మ్యాచ్ మొత్తం ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. కాంగో డిఫెండర్లు అతనిపై గట్టి నిఘా పెట్టడంతో గోల్ చేసే అవకాశాలు చాలా తక్కువగా లభించాయి. పెనాల్టీ బాక్స్‌లో కూడా అతని ప్రభావం కనిపించలేదు. చివరి నిమిషాల్లో వచ్చిన ఒక హెడ్డర్‌ను కూడా కాంగో గోల్ కీపర్ సులభంగా అడ్డుకున్నాడు. గోల్ గానీ, అసిస్ట్ గానీ నమోదు చేయలేకపోయిన రొనాల్డోపై అభిమానులు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన రొనాల్డో జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేశాడు.
“మేము కోరుకున్న ఆరంభం ఇది కాదు. కానీ టోర్నమెంట్ ఇంకా ముగియలేదు. తలెత్తుకుని తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారిస్తాం” అని రొనాల్డో పేర్కొన్నాడు. ఈ డ్రాతో పోర్చుగల్‌కు గ్రూప్ దశలో ముందున్న మ్యాచ్‌లు మరింత కీలకంగా మారనున్నాయి. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పోర్చుగల్, తర్వాతి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం తప్పక ఏర్పడింది.
It all ends square 🤝#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 17, 2026
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!