Site icon NTV Telugu

Karnataka: సిద్ధరామయ్య ప్రభుత్వంలో 24మంది మంత్రులపై క్రిమినల్ కేసులు

Karnataka Cabinet Expansion

Karnataka Cabinet Expansion

Karnataka: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం పూర్తి రూపం దాల్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించారు. కొత్తమంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. సిద్ధరామయ్య కేబినెట్‌లో మొత్తం 32 మంది మంత్రులకు స్థానం లభించింది. సిద్ధరామయ్య కేబినెట్‌ మంత్రులకు కూడా క్రిమినల్‌ కేసులు తప్పడం లేదు. 32 మంది మంత్రుల్లో 24 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికలో ఈ సమాచారం వెల్లడైంది.

నివేదిక ప్రకారం.. 32 మంది మంత్రుల్లో 31 మంది కోటీశ్వరులు ఉన్నారు. వారి సగటు ఆస్తులు దాదాపు రూ. 119.06 కోట్లు. సిద్ధరామయ్య తన ఆస్తులు రూ.51 కోట్లుగా ప్రకటించారు. అందులో ఆయనకు రూ.23 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఈ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రూ. 1,413.80 కోట్ల ఆస్తులను ప్రకటించారు. కేవలం రూ.58.56 లక్షల ఆస్తులున్న మంత్రుల్లో తిమ్మాపూర్ రామప్ప బాలప్పకు అత్యంత తక్కువ ఆస్తులున్నాయి.

Read Also:Maharastra: భార్య పిల్లలను కనడం లేదని కిరాతకంగా చంపిన భర్త

ఏకైక మహిళా మంత్రి కూడా కోటీశ్వరురాలే
సిద్ధు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా ఎమ్మెల్యే లక్ష్మీ ఆర్ హెబ్బాళ్కర్. ఆమె కూడా కోటీశ్వరురాలే. రూ.13 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్న ఆమెకు రూ.5 కోట్లకు పైగా అప్పులున్నట్లు ప్రకటించారు. బాధ్యతల పరంగా డీకే శివకుమార్ నంబర్ వన్. కనకపుర స్థానం నుంచి గెలుపొందిన శివకుమార్ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో రూ.265 కోట్ల బాధ్యతను ప్రకటించారు.

8 నుండి 12 మధ్య చదివిన వారు ఆరుగురు
ఇక మంత్రుల విద్య గురించి మాట్లాడితే… క్యాబినెట్‌లో స్థానం సంపాదించుకున్న మంత్రులలో 8 నుండి 12 మధ్య విద్యార్హత ప్రకటించిన వారు ఆరుగురు. గ్రాడ్యుయేట్ లేదా ఉన్నత విద్యార్హత కలిగిన వారు 24 మంది మంత్రులు ఉన్నారు. ఇద్దరు మంత్రులు డిప్లొమా హోల్డర్లు.

Read Also:Delhi Incident: ఢిల్లీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను 21 సార్లు కత్తితో పొడిచి హత్య..

యసు విషయానికొస్తే
సిద్ధరామయ్య కేబినెట్‌లోని మొత్తం మంత్రుల్లో 41 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 18 మంది ఉన్నారు. 14 మంది మంత్రుల వయస్సు 60 నుంచి 80 ఏళ్ల మధ్య ఉంటుంది. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్‌తోపాటు మరో ఎనిమిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శనివారం మరో 24 మంది మంత్రులను కేబినెట్‌లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మంత్రుల శాఖలు కూడా విభజించబడ్డాయి.

Exit mobile version