Crime Thriller:మెదక్ జిల్లా శివంపేట మండలంలోని మగ్దుంపూర్ శివారులో జూలై 21న హత్యకు గురైన యువకుడు సబిల్ (21) కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన ప్రేమ, పరువు, బ్లాక్‌మేయిల్ చుట్టూ మలుపులు తిరిగి చివరకు విషాదంగా మిగిలింది. హత్యకు గురైన సబిల్‌పై ఇదివరకే అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్, న్యూడ్ ఫోటోల బెదిరింపులతో కేసులను పెట్టినట్లు విచారణలో వెల్లడయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Crime News: అదృశ్యమైన యువకుడు హత్యకు గురి.. మేనమామే ప్లాన్ చేసి..?
హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన సబిల్, కొన్నేళ్లుగా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఓ కార్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడే పని చేస్తూ షాపు ఓనర్ బంధువైన ఒక బోరబండ మైనర్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇది తెలుసుకున్న షాపు యజమాని సబిల్‌ను పని నుంచి తొలగించాడు. అలా కొన్నిరోజుల తర్వాత, ఆ మైనర్ అమ్మాయిని ఇంటి నుంచి తీసుకెళ్లాడు సబిల్. దీనితో అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దీనితో సబిల్ అమ్మాయిని తిరిగి ఇంటికి పంపించాడు. కానీ, ఆ తర్వాత అమ్మాయి న్యూడ్ ఫోటోను కుటుంబానికి పంపించి 5 లక్షలు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీనితో అమ్మాయి కుటుంబంలో తీవ్ర ఆవేదనకు దారి తీసింది.
Tollywood : యాంకర్ సుమ భర్త.. నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
ఈ ఘటనతో ఆవేశానికి లోనైన అమ్మాయి కుటుంబ సభ్యులు, జూలై 21న ఈ విషయాలపై మాట్లాడుదాం రా.. అంటూ మగ్దుంపూర్ శివారుకు పిలిచి సబిల్‌ను హత్య చేశారు. పోలీసులు ఈ హత్యను పూర్తిగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. ఈ ఘటనపై నేటి సాయంత్రం, తూప్రాన్ డీఎస్పీ ఘటనకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. పోలీసులు ఇప్పటికే హత్యకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించి, నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
