‘ఆచార్య దేవోభవ’.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు కట్టబెట్టింది మన దేశం. అయితే ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెస్తున్నారు. కీచకోపాధ్యాయులకు దేహశుద్ధి చేసినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో లక్ష్మన్న ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా విద్యార్థినులపై లక్ష్మన్న లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినులను తాకరాని చోట్ల తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. టీచర్ లక్ష్మన్న తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. బాలికల తల్లిదండ్రులు, స్థానికులు స్కూల్‌కి వెళ్లి లక్ష్మన్నను చితకబాదారు. పాఠశాలలోని మిగతా పాధ్యాయులు తల్లిదండ్రులను అడ్డుకుని.. లక్ష్మన్నను గదిలో బంధించారు. ఎంఈవోలు, పోలీసులు స్కూల్‌కి వచ్చి విచారణ చేపట్టారు.