Crime:అందోల్ మండల పరిధిలోని జోగిపేటలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తుండగా పట్టించాడని శేఖర్ అనే బాలుడిని నాగరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు తానే హత్య చేసినట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సెల్ టవర్ ఎక్కి కేబుల్ వైర్లతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం అందోల్ మండల పరిధిలోని జోగిపేటకు చెందిన నాగరాజు దొంగతనం చేస్తుండగా శేఖర్ అనే బాలుడు చూసి స్థానికులకు పట్టించాడు. ఇది జీర్ణించుకోలేని నాగరాజు నిన్న రాత్రి ఆ బాలుడితో మాట్లాడాలని పిలిచాడు. అక్కడికి వెళ్లిన బాలుడిని హత్య చేసి బావిలో పారేశాడు. నిందితుడు తానే హత్య చేసినట్లు ఉదయం పోలీసులకు ఫోన్ చేసి నేరం ఒప్పుకొని సెల్ టవర్ ఎక్కాడు.
READ MORE: Neha Murder Case: ‘‘ నా కొడుకును శిక్షించండి’’.. ఫయాజ్ తండ్రి క్షమాపణ..
అతడిని అడ్డుకోవడాని వెళ్లిన మరో ఇద్దరిపై కూడా కత్తితో దాడి చేశాడు. శేఖర్ (13) మృతదేహాన్ని బావిలో గుర్తించి వెలికి తీశారు. శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో వైపు సెల్ టవర్ పై ఎక్కిన నిందితుడు ఉదయం నుంచి అక్కడే ఉన్నాడు. ఉలుకు పలుకు లేకపోవడంతో డ్రోన్ కెమెరాతో నాగరాజు కదలికలను పోలీసులు గమనిస్తుండగా.. ఇంతలో నాగరాజు కేబుల్ వైర్లతో ఉరేసుకుని వేలాడుతున్న దృష్యం కనిపించింది. సెల్ టవర్ పై ఆత్మహత్య చేసుకుని ఉండటంతో మృతదేహాన్ని కిందికి దించే యత్నం చేస్తున్నారు.
Crime: దొంగతనం చేస్తుండగా పట్టించాడని బాలుడిని హతమార్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Crime