Site icon NTV Telugu

Brand Market: బాలీవుడ్ స్టార్లను మించిపోయిన భారత క్రికెటర్లు.. కోహ్లీ, ధోనీ, సచిన్ టాప్ త్రీ

Brand Market

Brand Market

ఇండియాలో క్రికెట్‌కు ఉన్న అపారమైన ఆదరణ కారణంగా, ప్రపంచంలోని ఇతర క్రికెటర్ల కంటే ఇక్కడి ఆటగాళ్ల బ్రాండ్ విలువ చాలా ఎక్కువ. ఇది కాకుండా.. భారత క్రికెటర్లు ప్రపంచ వేదికపై కూడా గుర్తింపు పొందారు. అయితే బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ క్రికెటర్ల కంటే బాలీవుడ్ స్టార్లు చాలా వెనుకబడి ఉన్నారు. ఒక నివేదిక ప్రకారం.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని బాలీవుడ్ ప్రముఖులను అధిగమించారు. బాలీవుడ్ స్టార్ల కంటే క్రికెటర్లే ​​ఎక్కువ పాపులర్ సెలబ్రిటీలుగా ఎదిగారని తాజా పరిశోధనలో వెల్లడైంది. హన్సా రీసెర్చ్ బ్రాండ్ ఎండోర్సర్ రిపోర్ట్ 2024 ప్రకారం.. క్రికెటర్లు భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్‌లుగా బాలీవుడ్ నటులను అధిగమించారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ వంటి అథ్లెట్లు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఆటగాళ్ళు వారి ప్రదర్శన, విశ్వసనీయత, అభిమానుల ఫాలోయింగ్ కారణంగా ఎండార్స్‌మెంట్‌ల కోసం అగ్ర ఎంపికలలో ఉన్నారు.

Read Also: TTD: తిరుచానూరులో రేపటి నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

హన్సా రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ కర్నాడ్.. క్రికెటర్లు తమ అభిమానులతో ఎలా కనెక్ట్ అవుతారో వివరించారు. నిరాడంబరమైన నేపథ్యాల నుంచి ఎదిగి తమ దేశం గర్వపడేలా చేసిన రియల్ లైఫ్ హీరోలు క్రికెటర్లని అన్నారు. ఈ పరిశోధన భారతదేశంలోని 36 నగరాల్లోని 4000 మందిని ఆన్‌లైన్‌లో అడిగిన ప్రశ్నలపై ఆధారపడి ఉంది. ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించిన 29 సబ్‌ కేటగిరీలను రూపొందించి నిర్ణయం తీసుకున్నారు.

భారతదేశంలోని ప్రముఖ వ్యక్తుల జాబితా:-
విరాట్ కోహ్లీ
ఎంఎస్ ధోని
సచిన్ టెండూల్కర్
షారుక్ ఖాన్
అక్షయ్ కుమార్
అమితాబ్ బచ్చన్
అల్లు అర్జున్
సల్మాన్ ఖాన్
హృతిక్ రోషన్
దీపికా పదుకొనే

Exit mobile version