టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. శ్రీ చరిణికి మంత్రులు అనిత, సంధ్యా రాణి, ఏసీఏ చైర్మన్ కేశినేని చిన్ని సహా మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, ఎంఎస్కే ప్రసాద్ స్వాగతం పలికారు. మహిళా క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణికి పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువా కప్పి ఘనంగా అసత్కరించారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన శ్రీ చరణికి అందరూ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రులు సంధ్యారాణి, అనిత, సవితలు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం చంద్రబాబు దగ్గరకు శ్రీ చరణిని తీసుకెళ్లారు. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను ఇండియన్ ఉమెన్ క్రికెటర్ కలిశారు. శ్రీ చరణిని సీఎం అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్న సీఎం అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ కూడా ఉన్నారు.
Also Read: RCB Sale: అమ్మకానికి ఆర్‌సీబీ టీమ్.. పోటీలో ఆరుగురు బడా వ్యాపారవేత్తలు!
శ్రీ చరణికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు డబ్బు, ఇంటి స్థలంను ఏపీ సర్కార్ బహుమతిగా అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఏపీ సర్కార్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వన్డే ప్రపంచకప్ 2025లో శ్రీ చరణి అదరగొట్టింది. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు ఖాతాలో వేసుకుంది. 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. మిగతా 8 మ్యాచ్‌లలో వికెట్ తీసింది. సెమీస్, ఫైనల్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి టీమిండియా విజయానికి బాటలు వేసింది.
