Site icon NTV Telugu

Ambati Rayudu Comments: నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను..

Ambati

Ambati

రాజమండ్రిలో క్రికెట్ స్టేడియం నిర్మించి యువతను ప్రోత్సహించాలని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ని అంబటి రాయుడు కోరారు. రాజమండ్రిలో కంబాల చెరువు అభివృద్ధి పనులు, ఆక్వా లేజర్ షో ప్రదర్శనలను చూసి రాయుడు ఆనందోత్సాహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఆలోచిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా పర్యటిస్తున్నానని అతడు చెప్పారు. 2024 ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంబటి రాయుడు వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది.. యువ రాజకీయ నేతలకు జగన్ స్ఫూర్తి కావాలని ఆయన పిలుపు నిచ్చారు.

Read Also: Israel-Hamas War: లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి “మూర్ఖపు తప్పిదం” అవుతుంది.. హిజ్బుల్లా వార్నింగ్..

ఇక, సాంస్కృతిక రాజధాని రాజమండ్రి నగరంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో హరిత నగరాన్ని తలపిస్తోందని, అద్భుత నగరంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ‘యువత-హరిత చాలా అద్భుతమైన కార్యక్రమం.. ఒక మహా యజ్ఞంలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలి అని అతడు తెలిపారు. రాజమండ్రి చాలా అభివృద్ధి చెందింది.. యువకులు రాజకీయాలలోకి వస్తే.. అభివృద్ధి ఎలా ఉంటుందో ఎంపీ భరత్ ఆచరణలో చేసి చూపించారు అని అంబటి రాయుడు అన్నారు. ఇక, వరల్డ్ కప్ లో ఇండియా టీం గెలవాలని కోరుకుంటున్నానని అని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ప్రస్తుతం టీమిండియా అద్భుతంగా ఆడుతుంది.. కొద్దిగా కష్టపడి ఆడితే భారత జట్టు వరల్డ్ కప్ గెలవడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version