NTV Telugu Site icon

AUS vs SA: భారత్ దెబ్బకు బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాపై రెండు మార్పులతో బరిలోకి!

Aus Vs Sa

Aus Vs Sa

Australia have won the toss and have opted to field: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో రసవత్తర సమరం ఆరంభం కానుంది. లక్నోలోని అటల్‌ బిహారీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకునున్నాడు. భారత్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యటింగ్ చేసిన ఆసీస్.. బౌలర్ల దెబ్బకు 199 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

‘ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ వికెట్‌పై కాస్త తేమ ఉన్నట్టుంది. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. గ్రీన్ స్థానంలో మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ స్థానంలో జోష్ ఇంగ్లిస్ జట్టులోకి వచ్చారు. భారత్‌పై కొన్ని పరుగులు తక్కువగా చేశాం. అయితే మేము బౌలింగ్ చేసిన విధానం పట్ల చాలా సంతోషంగా ఉంది. దక్షిణాఫ్రికా టోర్నమెంట్‌ను చాలా బాగా ప్రారంభించింది. ఈ మ్యాచ్ మాకు పెద్ద సవాల్’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. మరోవైపు ప్రొటీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కోయెట్జీ స్థానంలో షమ్సీ ఆడుతున్నాడు.

ప్రపంచకప్‌ 2023లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో మ్యాచ్‌ ఆడాయి. దక్షిణాఫ్రికా శ్రీలంకపై ఘన విజయం సాధించగా.. ఆస్ట్రేలియా మాత్రం టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా.. ఆసీస్ 3, ప్రొటీస్ 2 విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌ టై అయ్యింది. ఈ ఇరు జట్లు చివరిసారిగా 2019 ప్రపంచకప్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

తుది జట్లు:
ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, మార్నస్‌ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, జోస్‌ ఇంగ్లిస్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌.
దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌, టెంబా బవుమా (కెప్టెన్‌), రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, మార్కో జన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌, కగిసో రబాడ, తబ్రేజ్‌ షంషి, లుంగి ఎంగిడి.

 

Show comments